Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

బొమ్మల కొలువు

సంక్రాంతి పండుగ సందర్భముగా తెలుగింటిలో బొమ్మల కొలువును పెట్టడం అనాదిగా వస్తుంది. ఇంటిలో రకరకాల రంగు రంగుల బొమ్మలను పెట్టి చిన పిల్లలను పేరంటాండ్లను పిలిచి వేడుక చేసుకొంటారు. బొమ్మల కొలువులో మట్టి బొమ్మలు, లక్కబొమ్మలు, వివిధ దేవీ దేవతా విగ్రహాలే కాక బుట్ట బొమ్మలు, పెళ్ళి కూతురూ, పెండ్లి కొడుకు బొమ్మలు నెమళ్ళు, గుర్రాలు వంటి జంతువుల బొమ్మలను పెట్టి అందంగా అలంకరిస్తారు. బొమ్మల కొలువు యొక్క మూలాధారం ఏమిటంటే మన సాంప్రదాయం ప్రకారం, ఆది శక్తి అయిన ఆ అమ్మవారిని కొలుస్తాము, ఈ పండుగ సందర్బంగా ఆ ముక్కోటి దేవతలు కూడా అమ్మవారిని కొలుస్తారని నమ్ముతాము కాబట్టి దేవీ దేవతా విగ్రహాలను బొమ్మల కొలువుగా పెట్టి అమ్మవారిని కొలిచి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం అందిస్తారు.


*** ***
All rights Reserved