బెండకాయ తో వంటలు



బెండకాయ ఇగురు: 

కావాలసినవి: nothing బెండకాయలు లేతవి - 1/2 కేజీ తాలింపు దిన్సులు - తగినన్ని ఎండుమిర్చి - 2 ఉప్పు - తగినంత నూనె చిన్న గెరిటడు


తయారుచేయు విధము: బెండకాయను పుచ్చులు లేకుండా ముక్కలు తరుగు కోవాలి. బాండ్లీ లో నూనె పోసి, తాలింపు దిన్సులూ ఎండుమిర్చి ముక్కలు బాగా వేగక బెండకాయ ముక్కలు వేసి కలిపి, పది నిమిషాలుంచి, కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. బాగా ముగ్గాక కూర కిందకి దించి, వేడి మీద తింటే కూర చాలా బాగుంటుంది.

వడ్డించడం: వేడి అన్నంలోకి, చపాతీ లోకి ఈ కూర బగుంటుంది.
------------------------------------------
బెండకాయ వేపుడు: 

కావాలసినవి: nothing బెండకాయలు - 1/2 కేజీ ఉప్పు - తగినంత కారం - ఒక చంచా వెల్లుల్లి రెప్పలు - 2 (ఇష్ట ప్రకారము) నూనె - చిన్న గరిటడు



తయారుచేయు విధము: బెండకాయలను సన్నగా పొడుగుగా తరుగుకోవాలి. బాండ్లీలో నూనె వేసి బాగా కాగాక తరిగిన బెండకాయలను అందులో వేసి రెండు నిమిషాలకు ఒక సారి తిప్పుతూ బాగా వేయించాలి. బెండకాలు వేగడానికి సమయం తీసుకొంటాయి. సన్న సెగ మీద చాలా సేపు వేయిస్తే ఎంతో రుచిగా వుంటుంది. బెండకాయలు దోరగా వేగిన తరువాత ఉప్పు, కారం, వెల్లిల్లి రెప్పలి వేసి మళ్ళీ తిప్పాలి.

వడ్డించడం: ఈ వేపుడు టిఫిన్ బాక్స్‌లో కి కూడా చాలా బాగుంటుంది.
------------------------------------------
బెండకాయ శనగ పిండి వేపుడు: 

కావాలసినవి: nothing బెండకాయలు - 1/2 కేజీ ఉప్పు - తగినంత కారం - ఒక చంచా సనగ పిండి - రెండు చంచాలు నూనె - చిన్న గరిటడు


తయారుచేయు విధము: బెండకాయలను సన్నగా పొడుగుగా తరుగుకోవాలి. బాండ్లీలో నూనె వేసి బాగా కాగాక తరిగిన బెండకాయలను అందులో వేసి రెండు నిమిషాలకు ఒక సారి తిప్పుతూ బాగా వేయించాలి. బెండకాలు వేగడానికి సమయం తీసుకొంటాయి. సన్న సెగ మీద చాలా సేపు వేయిస్తే ఎంతో రుచిగా వుంటుంది. బెండకాయలు దోరగా వేగిన తరువాత ఉప్పు, కారం, వెల్లిల్లి రెప్పలి వేసి మళ్ళీ తిప్పాలి. తరువాత శనగ పిండి వేసి రెండు నిమిషాలు పొయ్యిమీద వుంచి దించాలి.

వడ్డించడం: ఈ వేపుడు టిఫిన్ బాక్స్‌లో కి కూడా చాలా బాగుంటుంది.
------------------------------------------
బెండకాయ కొబ్బరి వేపుడు: 

కావాలసినవి: nothing బెండకాయలు - 1/2 కేజీ ఉప్పు - తగినంత కారం - ఒక చంచా ఎండు కొబ్బరి చిన్నది నూనె - గరిటడు


తయారుచేయు విధము: బెండకాయలను సన్నగా పొడుగుగా తరుగుకోవాలి. బాండ్లీలో నూనె వేసి బాగా కాగాక తరిగిన బెండకాయలను అందులో వేసి రెండు నిమిషాలకు ఒక సారి తిప్పుతూ బాగా వేయించాలి. సన్న సెగ పై వేయించి, బెండకాయలు దోరగా వేగిన తరువాత ఎండు కొబ్బరి వేసి ఎర్రగా వైచాలి తరువాత ఉప్పు, కారం, వేసి తిప్పాలి.

వడ్డించడం: ఈ వేపుడు వేడిగా తింటే బాగుంటుంది.
------------------------------------------
బెండకాయ గుత్తులు: 

కావాలసినవి: nothing బెండకాయలు లేతవి - 1కేజీ మినపప్పు, శనగపప్పు, ఆవాలు - తగినన్ని మిరిపకాయలు - 10


తయారుచేయు విధము: ముందుగా బాండ్లీలో నూనె పోసి, మిరపకాయలు తాలింపు గింజలు వేయించి, ఉప్పు వేసి పొడి కొట్టుకోవాలి. తర్వాత, బెండకాయలు నాలుగు చీలికలుగా, విడిపోకుండా గుత్తిగా తరగాలి. తరువాత, నూరి ఉంచిన కారపు పొడి బెండకాయల్లో కూరి, దారంతో పొడి రాలిపోకుండా కట్టి నూనెలో వేయించాలి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.
------------------------------------------
బెండకాయ పచ్చడి: 

కావాలసినవి: nothing బెండకాయలు లేతవి - 1/2 కేజీ ఎండు మిరిపకాయలు - 50 గ్రాములు నూనె - చిన్న గిన్నెడు తాలింపు దిన్సులు చింతపండు


తయారుచేయు విధము: ముందుగా మిరపకాయలు, తాలింపు దిన్సులు వేయించుకోవాలి అవి వేగాక, తీసి, అందులోనే మరి కొంచెం నూనె వేసి, చింతపండు కూడా ఆ ముక్కల మధ్యలో పెట్టి, కొద్దిగా నీరు జల్లి మూతపెట్టండి ముక్కలు చక్కగా మగ్గి, చింతపండు కూడా, వాటితో పాటు కలిసి పోతుంది. వేయించిన మిరపకాయలను, ఉప్పు, పసుపు వేసి దంచి, ఉడికిన బెండకాయ ముక్కల్ని కలిపి పచ్చడి చేయండి జిగురుగా ఉందని తినడం మానేయకండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
------------------------------------------
బెండకాయ పులుసు: 

కావాలసినవి: nothing బెండకాయలు లేతవి - 1/4 కేజీ ఉల్లిపాయలు - పెద్దవి 2 చింతపండు - పెద్ద నిమ్మకాయంత పసుపు - ఒక చంచా ఉప్ప - తగినంత నూనె - రెండు చంచాలు


తయారుచేయు విధము: బెండకాయను మూడు ముక్కలుగా తరగండి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరగండి. ముందుగా చింతపండు నానబెట్టి, పలుచగా అంటే ఒక అరలీటరు నీళ్ళుగా చూసి, రసం తీయండి. ఉప్పు, పసుపు వేసి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.
తరువాత బాండ్లీలో పొయ్యిమీద పెట్టి, నూనె వేసి, అందులో తాలింపు దిన్సులు, ఎండు మిరపకాయలు ముక్కలు వేసి వేగాక కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, చిటపటలాడాక, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాలు ఉంచి, కలిపి ఉంచుకున్న చింతపండు రసం పోయండి. బాగా, ముక్క ఉడికే దాకా కాయండి ఈ పులుసు అన్నం లోకి చక్క్గా ఉంటుంది.

------------------------------------------