Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema
వేడి వేడి అన్నంలో ఎర్రటి ఆవకాయ వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత కమ్మగావుంటుందో. ఎండాకాలంవచ్చిందంటే మా అమ్మమ్మ చక్కటి పుల్లటి మామిడి పండ్లు తీసుకొచ్చి ఘాటైన ఎర్రని గుంటూరు మిరపకాయ పొడిలో మంచినూనె వేసి ఆవకాయ పడుతున్నప్పుడే అది చూస్తేనే నోరూరేది. అప్పటిలో ఊరగాయ జాడీలలో నిలవవుంచిన ఊరగాయ వేసుకొని తినని రోజే ఉండేది కాదు.ఈ ఊరగాయ తయారీలో ఇంట్లో వారందరూ ఎంతో ఉత్సాహంగా పల్గొనేవారు. ఒకరు ముక్కలను కడిగితే ఒకరు ఎండబెట్టిన ముక్కలను శుభ్రం చేసుకొనేవారు. కానీ ఇప్పటి వారికి అంత ఓపిక ఎక్కడ? దుకాణాలలో తయారు చేసే ఊరగాయలకన్నా సొంత ఇంటిలో తయారు చేసుకొనే ఊరగాయ రుచే వేరు. ఊరగాయ పట్టడం అంత కష్టమేమీ కాదు నేర్చు కొందామా మరి...
*** *** ***
All rights Reserved