Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

దేవునకు పంచోపచారట పూజ ఏలా చేయవలెను?

పంచోపచారట పూజ అనగా దేవునికి పంచ ఉపచారములతో పూజించుట అని అర్ధము. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము.

గందము : దేవునికి అనామిక (ఉంగరపు వేలు)తో గంధమును సమర్పించవలెను.

పుష్పము : దేవుని తత్వమును అత్యధికముగా ఆకర్షించునటువంటి పుష్పములు, పత్రములను (ఉదా: శ్రీ గనేషుణకు మందారము, ఈశ్వరునకు బిల్వ పత్రములు) దేవుని చరణములకు అర్పించవలెను.

ధూపము : ఆయా దేవుని తత్వమును అనుసరించి వారిని ఆకర్షించు సుగంధములు గల అగరబత్తులు వెలిగించవలెను.

దీపము : దేవునికి నెయ్యి దీపాలతో కుడి వైపుకి గుండ్రంగా మూడుసార్లు తిప్పుతూ హారతిని ఇవ్వాలి.

నైవేద్యము : అరటి ఆకు పై దేవునికి నైవేద్యము సమర్పించాలి, పాలు, బియ్యం, నెయ్యి, కొబ్బరితో చేసిన పరవాణ్ణము దేవునికి నైవేద్యముగా అందించడం ఆనవాయతి.

How to perform 'Panchopachaarata Puja' to God?


ప్రతి రోజూ దత్తాత్రేయుని నామజపమును ఏందుకు చేయవలెను?

పూర్వీకుల అసంతృప్త లింగదేహములు వలన పెళ్ళి కాకపోవుట, భార్యా- భర్త మధ్య అన్యోన్యత లేకపోవుట, గర్భధారణ కాకపోవుట, గర్భస్రావమగుట, వికలాంగులు జన్మించుట, ఏల్లప్పుడూ చెడు కలలు వచ్చుట, మానసిక వ్యాధులు లాంటి ఇబ్బందులు కలుగవచ్చును. ఈ ఇబ్బందుల నివారణ కొరకు అటాగే తరువాత కూడా ఇలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రతి రోజూ 1 -2 గంటల సమయం మరియు ఇబ్బంది కనుగుణంగా ఏక్కువ అంటే 6 గంటల సమయం 'శ్రీ గురుదేవదత్తా నామజపమును చేయవలెను.
Why should we recite the name of 'Dattatreya' everyday?


దేశ రక్షణ మరియు ధర్మరక్షణకై వీటిని పాటించండి!

- దేవతల చిత్రాలున్న దుస్తులను ధరించకండి.
- అవినీతిపరులకు విరుద్ధంగా, వారి పై పోలీసు అధికారులకు ఫిర్యాదు నమోదు చేయండి
- జాతీయ జండా, జాతీయ గీతం మరియు ఇతర దేశ చిహ్నములను గౌరవించండి.
- బంధువుల్లారా, ఆంగ్ల భాషలో మాట్లాడకుండా, మాతృభాషలో లేదా దేశభాషలోనే మాట్లాడండి.
Honour Country and Faith!


మకర సంక్రాంతి

సంక్రాంతి మహత్వము : సంక్రాంతి రోజు సూర్యుని ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రజో - సత్వ తరంగాల ప్రమాణము ఏక్కువ ఉండుట వలన ఈ కాలము సాధనకు పూరకంగా ఉండును.
సంక్రాంతి రోజు స్త్రీలు పసుపు - కుంకుమ ఏందుకు ఇస్తారు?
పసుపు - కుంకుము ఇచ్చుట వలన స్త్రీలలో శ్రీ దుర్గా దేవి తత్వము జాగృత్తము పసుపు - కుంకుమ ఇచ్చు స్త్రీల కళ్యాణమగును. సంక్రాంతి రోజు స్త్రీలు వాయనమోందుకు ఇచ్చెదరు? : వాయనము ఇచ్చేటప్పుడు వాయనమునకు కొంగు యొక్క ఆధారమిచ్చెరు. వాయనము ఇచ్చుట అనగా ఏదుటున్న జీవములోని దైవత్వానికి తనువు, మనసు మరియు ధనము వీటి త్యాగము ద్వారా శరణుకోరుట. కొంగు చివరి యొక్క ఆధారమిచ్చుట అనగా దేహము పైనున్న వస్త్రమును (దేవాబుద్ధి) త్యాగము చేయుటను సూచిస్తుంది. సంక్రాంతి సమయములో ఇచ్చిన వాయనము ద్వారా దేవతలు తొందరగా ప్రసన్నులవుతారు.
'Makara Sankranti'


దేవతల జయంతి - ఉత్సవ సమయములో ఆ దేవత నామజపమును చేయండి!

దేవతల జయంతి రోజు ఆ దేవత తత్త్వము లేదా ప్రతి యొక్క ధార్మిక ఉత్సవ సమయములో ఆ ప్రత్యేక దేవత యొక్క తత్త్వము ఏక్కువ ప్రమాణములో కార్యనిరతమై ఉండును. దేవతల జయంతి లేదా ఉత్సవ సమయంలో ఆయా దేవతల యొక్క నామ జపమును ఏక్కువగా చేసినచో దేవతా తత్త్వము ఏక్కువ ప్రమాణములో అభించును.
God's Birthday's


భగవంతుని అథిష్ఠానము యొక్క మహత్యమును తెలుసుకొండి!

అర్జునుడు బాహుబలంతో శ్రీకృష్ణుని అనగా భగవంతుని అధిష్ఠానము యొక్క సహాయముతో పోరాడి విజయమును సాధించాడు. దీనికి విరుద్ధంగా దుర్యోధనుడు కేవలం బాహుబలం ద్వారా పోరాడి లెక్కలేనంత సంపత్తు - సైన్యబలము ఉన్నప్పటికి నాశనమయ్యడు.
The miracle of 'Bhagavamtuni Adhistanam' !


హోళీ ఉత్సవము

హోళీ అనగా చెడు ప్రవుత్తి మరియు చెడు ఆలోచనలకు నాశనము చేసి సత్ ప్రవృత్తి యొక్క మార్గమును చూపించే ఉత్సవము. ఈ రోజు 'శ్త్రీ హోలికా దేవ్వై నమః' ఈ నామజపమును చేస్తూ ఆవు పిడకలు మరియు కర్రలను కాల్చవలెను. హోళీకి ప్రదక్షణ చేసి తరువాత శంఖమును ఊదవలెను. మరుసటి రోజు ప్రాతఃకాలములో హోళీ యొక్క బూడిదను పూజించి ఒంటికి రాసుకొన్న స్నానము చేయవలెను.
Holi Celebration


దేవస్థానములో దేవుని దర్శనమును చేయు సరైన పద్ధతి

మొదట కలశమునకు నమస్కారము చేయవలెను, తరువాత మెట్లకు నమస్కారము చేయవలెను. గంటను నెమ్మదిగా మ్రోగించవలెను, మనఃపూర్వకముగా దేవుని దర్శనం పొంది ప్రార్థన చేయవలెను. ప్రదక్షణ చేయునప్పుడు ప్రతి ప్రదక్షణ చేసిన తరువాత నిల్చుని దేవునికి నమస్కారము చేయవలెను. కొద్ది సమయము కూర్చొని నామజపము చేయవలెను. తిరిగి వచ్చేటప్పుడు దేవునికి నమస్కరించి మరిక్కసారి ప్రార్థన చేయవలెను. దేవస్థానము నుండి బయటికి వచ్చేటప్పుడుఒకేసారి వెనక్కి తిరిగి రాకూడదు.
How to visit God in the temple?


వటపౌర్ణమి రోజు స్త్రీలు రావి చెట్టును ఏందుకు పూజిస్తారు?

రావి చెట్టు అనగా శివస్వరూపము. రావి చెట్టును పూజించుట మనగా శివస్వరూపములో ఉన్న భర్తను స్మరించి తన ఆయువు పెరిగి వారి ప్రతికర్మము సఫలమవ్వాలి అని భగవంతుని ప్రార్థించడం. కర్మానికి శివుని తోడు ఉంటే శివ మరియు శక్తి వీరి ద్వారా జరిగే సమ్మిళిత క్రియ వలన వ్యవహారములోని కర్మము సాధనమై వారిద్దరికీ దాని నుండి లాభము కలుగును. రావి చెట్టుకు పత్తి దారమును ఏందుకు చుట్టెదరు? రావి చెట్టు మాను యొక్క నిలువు రంద్రములో ఉన్న సుప్తతరంగావుల శివ తత్త్వమును ఆకర్షించిన తరంగాలు కార్యోన్ముఖమై ఆకారమును ధరించును. పత్తిలోన పృథ్వి మరియు ఆప్ తత్త్వము వీటి సమోగముల వలన జీవమునకు ఈ సుప్త తరంగాలను గ్రహించుటకు సులభమగును.
Why do women pray to 'Ravi' tree on 'VataPournami'?


శాస్త్రానుసారంగా పుట్టిన రోజు పండుగ చేయుటలోని ఆంతర్యం

అభ్యంగస్నానం : ఒంతికి నూనెరాసుకొని స్నానము చేయుట వలన జీవి పై 'పనిత్రమూ అనే మొదటి సంస్కారము ఏర్పడును. పెద్దలకు

నమస్కారం : దీని వలన పెద్దల పై గౌరవము పెరిగి 'నిర్మలమూ అనే ద్వితీయ సంస్కారము ఆఎర్పడును.

హారతి ఇచ్చుట : హారతి ఇచ్చేటప్పుడు ఇలవేల్పు మరియు ఉపాస్యదేవతను స్మరించి 3 సార్లు తనపై అక్షింతలు వేయుట వలన చైతన్య స్వరూప తరంగాలు జీవి యొక్క బ్రహ్మరంధ్రము ద్వారా దేహములో ప్రవేశించును. ఈ తరంగముల వలన వాతావరాము శుద్ధి అగును. హారతి వలన జీవిపై 'శుభ్రతా అనే తృతీయ సంస్కారము ఆఎర్పడును.
How to celebrate Birthdays according to tradition?


ప్రారంభోత్సవము చేయు సరైన పద్ధతి ఆఎది?

ప్రారంభోత్సవమును కొబ్బరికాయ కొట్టి చేయవలెను; దీని వలన చెడుశక్తుల ఇబ్బంది దూరమై దేవతల తత్త్వము ఆకర్షితమై ఆ స్థలము శుద్ధి అగును.
How to Start a new venture?


స్త్రీ ఒడి నింపుటలోని శాస్త్రము మరియు దాని లాభము

ఒడి నింపేటప్పుడు ఇద్దరి భావము ఏలా ఉండవలెను?
ఒడి నింపే స్త్రీ, ఒడి నింపించుకొనే స్త్రీ అనగా ఆదిశక్తి (అమ్మవారి) రూపమని భావించుకోవాలి.

ఒడిని నింపేటప్పుడు బియ్యము ఏందుకు ఉపయోగిస్తారు?
బియ్యంలో దేవత యొక్క తరంగాలను ఆకర్షించి ప్రక్షేపించు క్షమత ఏక్కువగా ఉండును. దీని వలన ఒడి నింపించుకొనే స్త్రీ యొక్క పొత్తికడుపులోని ఆదిశక్తికి సంబంధించిన శక్తి జాగృతమగును. అందువలన ఒడి నింపేవారికి మరియు నింపించుకొనువారికి ఇద్దరికీ వారి ఇచ్చకు అనుసారంగా ఫలము దొరకును.
Why do we fill the lap of a women during celebrations?


రాఖీ పండుగ - కృతి మరియు శాస్త్రము :

రాఖీ పండుగ రోజు సోదరుడు కూర్చోవడానికి పీఠము పెట్టి దాని చుట్టుతా ముగ్గుపిండితో ముగ్గు వేయవలెను. రాఖి కట్టిన తరువాత సోదరునికి నెయ్యి దీపముతో హారతి ఇవ్వవలెను. దీని నుండి భగవంతుని తత్త్వము ఆకర్షితమై సోదరుని బుద్ధి సాత్వికమగుటకు సహాయమగును. తరువాత సోదరుడు సోదరికి శుఖం కలగానికి కోరుతూ అటాలే సోదరి సోదరునికి శుఖం కలగాలని కోరుతూ ఇద్దరూ ఇలవేల్పు దేవతకు లేదా ఉపాస్య దేవతకు మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి.
Rakhi Celebration


చేతులు జోడించి నమస్కారము చేయండి

కరచాలన చేయుటవలన క్రిములు వ్యాపిస్తాయి అందుకనే ఇప్పుడు విదేశాలలో కూడా 'కరచాలన చేయుటకు బదులు చేతులను జోడించి నమస్కారం చేయండీ అని ప్రచారము జరుగుతోంది. కరచాలన చేయుటవలన సూక్ష్మరూపంగా గల చెడు శక్తుల నుండి ఇబ్బంది కలిగే అవకాశముంటుంది. దీనికి విరుద్ధంగా చేతులను జోడించి నమస్కారం చేసినప్పుడు మనలో నమ్రత భావము పెరిగి వృత్తి సాత్త్వికమవుతుంది.
Why do we fold our hands in 'Namaskaram'?


దేశము యొక్క హాని జరగనివ్వకండి!

దేశములో వ్యవహారము, ఆహారము, ఆచారము, దుస్తులు మరియు భాష వీటిని వదులుకుంటే నెమ్మదిగా దేశహాని అగును. దీని వలన ప్రజల ప్రగతి అవ్వకుండా ఆషోగతియగును.

సమస్త దుఃఖములకు కారణమేమిటి?
అధర్మము - అధర్మము - అధర్మము

వ్యక్తికి కలిగే వివిధ శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఇబ్బందులు, అలాగే దేశములోని సమస్యలు దాడులు, నైసర్గిక ఆపదు, ధరల పెంపకం, భ్రష్టాచారము వంటి సమస్యలు తలెత్తును. వీటన్నిటికీ అధర్మాచరణయే మూలాకారణము. వీటన్నిటికీ ఒక్కటే పరిహారం - ధర్మాచరణ.
Patriotic Duty


శ్రీ కృష్ణ జన్మాష్టమి

గోపాలకాలా మహత్యము : అటుకులు, పెరుగు, పాలు, మజ్జిగ మరియు వెన్న ఇవి కాలలోని ముఖ్య పదార్థములు. ఇవి భక్తికి నిదర్శనము. ఇవి శ్రీ కృష్ణుని తత్త్వమును ఎక్కువగా ఆకర్షించుకొనును. జాన్మాష్టమి రోజు ఈ కాలాని ప్రసాదముగా తీసుకొనుట వలన శ్రీ కృష్ణుని తత్త్వము యొక్క లాభము ఎక్కువగా పొందుతారు.
Sri Krishna Janmastami


పితృపక్షములో మహాలయ శ్రాద్దము చేయండి

ఇంటిలో ఏవరైనా ఒకరు మరణించిన తరువాత వారిలో ఉన్న కోరికల పరిణామంగా వారి కుటుంబములో ఉన్న వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉండును. పితృపక్షములో మహాలయ శ్రాద్దమును చేయుటవలన మృత్యులోకములో చిక్కుకున్న పితృలకు సద్గతి దొరికి కుటుంబములోని ఇబ్బంది తగ్గును.
'Pitrupakshamu Mahaalaya Shaardhamu'


నవరాత్రి యొక్క ఆధ్యాత్మశాస్త్రము

ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి నవరాత్రి ఉత్సవము ప్రారంభమగును. కలశ స్వరూపములోని బ్రహ్మాండములో అవతరించిన తేజస్సుగల ఆదిశక్తిని అఖండంగా వెలుగు నందాదీపము మాధ్యమంగా తొమ్మిది రోజులు పూజించటం అనగా నవరాత్రోత్సవమును ఆచరించడం, ఇంటిలో కలశపూజ చేయుట వలన శ్రీ దుర్గాదేవితత్త్వము యొక్క లాభమగును. అలాగే వాస్తు కూడా చైతన్యమయమగును.
Navaratri


డీపావళి

ధనత్రయోదశి : ధన ప్రాప్తి కొరకు లక్ష్మీ పూజ చేయవలెను. అమరత్వమును ప్రసాదించే ధన్నంతరిని కూడా పూజించవలెను.

నరక చతుర్దశి : దీపము నుండి ప్రక్షేపితమగు తేజము నుండి చెడు శక్తులు నాశనమగుటకు దీపపూజను చేయవలెను.

లక్ష్మీ పూజ : శ్రీ లక్ష్మీ యొక్క మారక తత్త్వమును పొందుట కొరకు 3 రోజులు ధనసందను పూజించవలెను.

బలిపాడ్యమి : బలిరాజు ఆధిపత్యములోని చెడు శక్తుల నుండి ఇబ్బంది కలగకూడదని బలిరాజు యొక్క మూర్తిని పూజించి నైవేద్యమును పెట్టవలెను.

యమద్వితీయ : యమదేవునికి కృతజ్ఞత తెలుపుట కొరకు మరియు అకాలమృత్యువు రాకూడదని సాయంకాలము 13 దీపాలను వెలిగించవలెను.

అన్నయ్య పండుగ : ఈ రోజు చెల్లి అన్నయ్యకు హారతి ఇచ్చే రోజు. హారతినిచ్చేటప్పుడు చెల్లి 'భగవంతునికి హారతినిస్తున్నానూ అనే భావమును పెట్టుకోవడం వలన అన్నయ్యలోని భగవద్ తత్త్వము జాగృతమై చెల్లికి దాని నుండి లాభమగును.
Deepavali


ఉగాది పండుగ

ఆధ్యాత్మిక మహత్యము : ఈ రోజు బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు. అందువలన ఈ రోజు నిజమైన సంవత్సర ఆరంభం రోజు; ధ్వజమును స్థాపించే సరైన పద్ధతి : ఉగాది పండుగ రోజున ధ్వజమును స్థాపించేటప్పుడు ఇంటి ఏదురుగా, గుమ్మానికి కుడి భాగములో (ఇంటినుండి చూసినప్పుడు), భూమివైపు కొద్దిగా వాలించి స్థాపించవలెను. కింద స్వస్తిక్ గీసి దాని పై ధ్వజమును స్థాపించవలెను.
Ugadi


మహాశివరాత్రి వ్రతమును ఏందుకు చేయవలెను?

శివుడు రాత్రిలో ఒక ఝాము విశ్రాంతి తీసుకొనును. ఆ ఝామును మహాశివరాత్రి అంటారు. శివుడి ఈ విశ్రాంతి సమయములో శివతత్త్వము కార్యనిరతమై ఉండదు అనగా ఈ సమయములో శివుడు ధ్యానావస్థ నుండి సమాధి అవస్థను చేరుకుంటారు. ఈ సమయములో విశ్వములోని తయోగుణము ఏక్కువగును. మనపై దీని పరిణామము పడకూడదని మహాశివరాత్రి వ్రతమును చేసి శివతత్త్వమును ఆకర్షించుకోవలెను.
Why perform MahaSivaratri Vratam?
***


*** ***
All rights Reserved