Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

లోకస్వభావము

Human Nature

ఆరు నెలల సాహవాసముతో వాడేవీడౌను

After six months of friendship the nature of friends are exchanged.

పాముకి విషము తలనుండును - మనిషికి నిలువెల్లా విషమే

Snake has poison in her head - but a man has poison all over.

గాడిదకు గంధపు చెక్కల వాసన తెలియదు

A donkey cannot know the perfume of Sandalwood.

ఏ యండ కా గొడుగు పట్టవలెను

We should change the type umbrella with the weather.

వసుదేవు డంతటివాడు గాడిదకాళ్ళను పట్టుకొనెను

Even Vasudeva has to catch a donkey's leg.

బంగారు పళ్ళెమునకైనా గోడదాపు అవుసరము

Even a golden plate needs support.

ఎంతటి వారయినను లోకమునకు లొంగవలయును

No matter how strong you are, you are bound to society.

దుర్జనులు మంచివారితో కలహమును కోరుదురు

Bad people always fight with good people.

క్రొత్త ఒక వింత, పాత ఒక రోత

New is amazing, old is discouraging.

నిండు కుండ తొణకదు

A full pot never slips.

లేగలకు చేపనిదే ఆవులు పాలీయవు

Without the calf a cow never gives milk.

మంచివారికి మంచి, చెడ్డవారికి చెడు జరుగును

Good comes to those who are good and bad happens to those who are bad.

దేవుడు ఏమిచేసిననూ అది మనమేలు కొఱకే

God does everything for our own good.

ఎంత చెట్టున కంతే గాలి

The bigger the tree the more air it gives.

దేవుడిచిన బుధ్ధి దేవునివరకూ నుండును

The knowledge God gave us is for the God.

చిన్ననాటి అలవాట్లు చిరకాలముండును

Childhood habits stays with us forever. ***

మన మంచి పనులే మనకు ధనము

The good that we do is our legacy. ***

ఎవరు చేసిన పాపము వారిని వేటాడుచుండును

Those who do bad are haunted by it. ***

దైవధ్యానమును మరువరాదు

Never forget to pray. ***
All rights Reserved