Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema
.

ఉపగృహములు - లెట్రిన్స్, వంటశాలలు

Upagruhamulu(Subhouses) - Lavatories, Kitchens

 

1. ఇంటి చుట్టుకొంత ఖాళీ స్థలము విడిచి గృహ నిర్మాణము చేయవలెను. అన్ని దిక్కులకు సమానముగాని లేక తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులందు యితర దిక్కుల కంటే హెచ్చుగాగాని స్థలము విడిచి పెట్టిన అష్ట అయిశ్వర్యములు పొదుదురు.

1. When contructing a house we nust leave space around it. The space should be equal in all directions or the space in the Esanyam and North could be more than that of the rest then the residents enjoy great wealth.

2. ప్రధాన గృహము ననుసరించి ముందుగా ప్లాను వేసుకొని ఉపగృహములు నిర్మించవలెను.

2. Firt the main building should be planned and accordingly the sub houses should lie.

3. ఆగ్నేయ దిశలో వంటయిల్లు ఏర్పాటు చేసుకొనుట శుభము అట్టి అవకాశము లేనప్పుడు దక్షిణ, పడమర వాయువ్యాదిశలలో వంట ఏర్పాటు చేసుకొని ఆ గదులలో గూడ ఆగ్నేయ దిశ మార్పు ముఖముగా వంట చేయువారు నిలబడునట్లు ఏర్పాతు చేసుకొనుట శుభము కలుగును

3. The kitchen should be in the Agnaeya corner, if unable to do so then the second best position would be in the westren side of Vayuvyam. The person who cooks must be facing Agnaeyam, that is how everything should be arranged.

4. ఎట్టి పరిస్థితులలోను తూర్పు ఉత్తర ఈశాన్య దిశలలో వంట పొయ్యి ఏర్పాటు చేయరాదు. వీలుగాని పరిస్థితులలో వంటచేయువారు పడమర ముఖముగా లేదా ఉత్తర ముఖముగా నిలబడి వంటచేసే విధంగా పొయ్యి అమర్చవలెను.

4. At no time the stove should be arranged in the east, north or Esanyam. If that is not possible then the person who cooks must face west or North.

5. ముఖ ద్వారమునకు ఎదురుగా వంటపొయ్యి ఏర్పాటు చేయరాదు. వీలైనంత వరకు ఉపగ్ర్హములు ప్రధాన గృహమునకు ఆనించి కట్టరాదు.

5. The stove must not face the main entrance. If possible see that the subhouses do not touch the main house.

6. బాత్ రూంస్ తూర్పున లెట్రిన్స్ నైఋతి భాగమున కట్టుకొనవలెను. వీలిగాని పరిస్థితులలో ఆగ్నేయ, దక్షిణ పడమర లేదా వాయువ్యములలో నిర్మించవచ్చును.

6. Bath room should be in the east and lavatories to the Niruti. If not possible the the other directions that are suitable are Agnaeyam, Padamara(west), Dakshina (south), Vayuvyam.

7. సెప్టిక్ త్యాంక్ కేవలము, దక్షిణ, పడమర దిశలలోను నిర్మించుట శ్రేష్టము. విదిక్కులలోను ఇతర దిక్కులలోను నిర్మించరాదు టాంక్ రూముల పై కట్టరాదు.

Septic tank should be constructed only in the Dakshina or Padamara not in any other direction.

8. లెట్రిన్ లో సిట్టింగ్ ప్లేట్లు దక్షిణ, పడమర ముఖముగా ఉండునట్లు నిర్మించవలెను.

8. In latrines the sitting plate should be arranged in the Dakshina, Padamara facing.

9. ఉపహ్గృహాలు నిర్మించునప్పుడు వరుసగా నైఋతి, దక్షిణా ఆగ్నేయము, పడమర, వాయవ్య దిశలలోనే నిర్మించి, ఉత్తర ఈశాన్య మార్పులు దిశలు ఖాళీగానే ఉంచవలెను.

9. Theconstruction of the sub houses should be in the following order Niruti, Dakshina(southern) agneyam, Padamara (west), Vayuvyam. The Northern Esanyam must always be left open.

10. వాయవ్యమునకు పశుశాలలు, దాన్యపు కోట్లు, నైఋతిలో గుండ్రని గాదులు కట్టుట శుభప్రధము.

10. Vayuvyam should be left for cattle-houses, barns. Round storehouses must be constructed in the Niruti.

11. ఇల్లు రీమోడల్ చేయవలసి వచ్చినప్పుడు ప్రక్క స్థలములు కలిపి గృహ నిర్మాణము చేయవలసి వచ్చినప్పుడు, ఆ యిల్లు మ్మొత్తం పడగొట్టి మరల కట్టినప్పుడు వాస్తు రిత్యా కొత్త ప్లాన్ ప్రకారము ఏ ప్రక్కస్థలము కలిసినా దోషములేదు.

11. If remodelling a house by adding the nearby land, the house could be rebuilt then according to the vastu the land could be in any direction.

12. మెట్లు నిర్మించునప్పుడు తూర్పు ఈశాన్య, ఉత్తర ఈశాన్య భాగములు విడిచి ఏ దిశలోనైనా కట్టవచ్చును. ఈశాన్య దిశలో అర్ధచంద్రాకారపు మెట్లు పనికిరావు.

12. The staircases must not be in the Eastren Esanyam, Northern Easanyam anywhere else is fine. circular staircases in the Esanyam are not recommended.

13. మెట్లు డైరెక్టుగా (సాగుడు) మెట్లు నిర్మించరాదు. తలుపులు త్రిప్పి చివరి అడుగు తూర్పు లేక ఉత్తర దిశకు దిగునట్లు చూడవలెను.

13. Staircases should not be direct. the final step must be facing the East (turpu) or North (uttaram).

14. తులసి కోట వంటయింటికి ఎదురుగాగాని ఈశాన్య దిక్కునగాని నిర్మించుకొనుట శుభము కలుగును.

14. Tulasikota must be situated opposite the kitchen or in the Esanyam which is auspicious.

15. దేవునికి ప్రత్యేకముగా ఒక గది ఏర్పాటు చేసుకొనవలెను. ఈశాన్య లోపము రాకుండా గల ఈశాన్యపు గది శుభము. ఈశాన్య మూలలందు దేవునికి కూడ అరుగులు నిర్మించరాదు. ఆసనము మాత్రం ఏర్పాటు చేయవలెను.

15. A special room for the deity must be arranged in a room where there is no fault in the Esanyam. Platforms must not be constructed for the Gods in the Esanyam only a seat must be arranged.


16. దంపుడు రోళ్ళు, రుబ్బురోళ్ళు దక్షిణ లేక పడమర భాగములలో ఏర్పాటు చేయవలెను.

16. Mortars must be arranged in the south or west.
back Back
All rights Reserved