Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

పండుగ విశిష్టత :

అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమికల మాసం ఆశ్వయుజమాసం. శరద్రుతువు ఈ నెలతో ప్రారంభమవుతుంది. ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలు దసమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నవరాత్రులు దుర్గా దేవికి ప్రత్యేక పూజలు శాంతి హోమాలు జరుపుట ఆనవాయతి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే 'దేవీనవరాత్రులు ' అని పిలవ బడుచున్నవి. మహుషాశురమర్ధిని, శక్తి స్వరూపిని అయిన దుర్గా దేవి 9 అవతారాలని ప్రతిష్టించి అర్చనలూ, పూజలు జరుపుకుంటారు. నవవిధి పిండివంటలతో విశేష పూజలతోదేవిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజులు శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిత్యము చేసుకొనవలెను. కొంతమంది తమ ఇంట్లో ఆహవనీయ అగ్ని, గ్రహపత్య అగ్ని, దక్షిని అగ్ని అను హోమాలు రోజూ జరుపుకుంటారు. ఇవే కాకుండా అదిత్య హొమము మహాసూర్య మంత్రాలను పఠిస్తూ జరుపుతారు. ఈ హొమములు చేయుట వలన ఇంటి ఆవరణం మహా శక్తి మయమై, ఇంటి వాతావరణం ఎల్లప్పుడు స్వచ్చంగా వుండును.

దేవీ నవరాత్రులలో మొదటి మూడు దినములు దుర్గా రూపాన్ని ఆరాధించవలెననీ, తరువాత మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించవలెననీ, మిగిలిన మూడు దినములు సరస్వతీ రూపాన్ని ఆరాధించవలెననీ పెద్దలు చెబుతారు.

నవరాత్రులలో అమ్మవారి నవవిధ అలంకరణలు ఇలా ఉంటాయి...

1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి
4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిథ పంచమి
6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
10వ రోజు - ఆశ్వయుజ దసమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదసమి

ఈ దసరా ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన రోజులు దుర్గాష్టమి, మహార్నవమి, విజయదసమి. ఈ రోజులలో అమ్మవారికి విశిష్ట పూజలు జరుపుతారు.


పూజా విధానం
కథ - పురాణం
విశేషముగా జరుపుకొను దేవాలయములు


 

Back ***
All rights Reserved