Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

మహా శివరాత్రి

 

శివ రాత్రి ఈశ్వరునికి అత్యంత ప్రియమైనది.ఈశ్వరుడు అభిషేక ప్రియుడని ప్రతీతి. మహా శివరాత్రి పర్వదినమున పాలు, తెనె, నీరు, నెయ్యి, బిల్వ పత్రములతో అబిషేకించి, నిర్మలమైన మనస్సుతో ఓం నమః శివయ అను పంచాక్షరీ మంత్రాని జపించిన వారు మోక్షన్ని పొంది ఈశ్వరుని సన్నిధానం పొందుతారని పతీతి.

శివరాత్రి నాడు తెల్లవారుఝామునే లేచి గంగలో స్నానమాచరించి, ఈశ్వరుని దేవాలయము దర్సించి, లింగానికి మూడుమార్లు ప్రదక్షిన చసి పాలతో అభిషేకించాలి. రోజంతా ఉపవాసముండి రాత్రంతా సివ నామ స్మరణ చేసుకొంటూ జాగారం చేసిన భక్తుల కోరికలను ఆ పరమేస్వరుడు తప్పక వింటాడని పెద్దలు చెపుతారు.

స్కంద పురాణంలో నాలుగు శివరాత్రుల గూర్చి ప్రస్తావించారు. మొదటిది 'నిత్య శివరాత్రీ రెండవది కృష్ణ పక్ష చతుర్దసి నందు 'మాస శివరాత్రీ జరుపుకొంటారు. మూడవది మాఘ శివరాత్రి, ఇది మాఘ మాసము నందు మొదటి పదమూదు రోజుల తరువాత వచ్చే చతుర్దసి నాడి జరుపుకొంటారు. నాలుగవది అత్యంత ముఖ్యమైనది, మాఘ మాసము నందలి కృష్ణ పక్షము చతుర్దసి నాడు మహా శివరాత్రి జరుపుకొంటారు.

శివరాత్రి పర్వదినాన శివుని పాలు, తెనె, పెరుగు, నెయ్యి, నీటితో అబిషేకించి 'ఓం నమః శివాయా' అను పంచాక్షరీ మంత్రాన్ని జపించి, సివలింగానికి కుంకుమాభిషేకం చెయాలి, పిమ్మట మూడు బిల్వ పత్రాలతో ఈశ్వరుని అలంకరించాలి, కొంత మంది బిల్వ పత్రాలు లక్స్మికి చిహ్నంగా బావిస్తారు. రేగి పళ్ళు ఈ రొజున ప్రత్యేక నైవెద్యంగా అందిస్తారు. దేవుని ధూప దీప నైవేద్యాలతో కొలుస్తారు.

శివ పురాణం ప్రకారం ఈ రోజులో పూజకు ఉపయౌగించే ఆరు పధ్హర్ధాలకు ఒక ప్రత్యేకత ఉంది.
- పాలు,తెనె, పెరుగు, నీటితో లింగానికి చేయు అబిషేకం స్వచ్చమైన మనస్సుకు చిహ్నం.
- కుంకుం శీలానికి చిహ్నం
- నైవేద్యం కోరిన కొర్కెలు తీర్చుటకు మొక్కు.
- ధూపం సిరి సంపదలకు పతీక.
- దీపం విఘ్నానానికి
- తాంబూలం ఇహలోక భొగాలను పురస్కరించు కొనునది.
దేవుని అబిషేకించు పాలు - స్వచ్చతకు
పెరుగు - సంపదకు
తెనె - తియ్యని పలుకులకు
నెయ్యి - విజయానికి
చక్కర - సంతోషానికి
నీరు - స్వచ్చతకు పతీకలు

శివరాత్రి మహిమలు చెప్పనలవి కావు, అలనాటి నుండి నేటి వరకూ శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకొంటున్నారు. త్రిలింగ దేశమైన మన్ ఆంద్రప్రదేశ్ లో శైవక్షేత్రాలకు కొదువ లేదు. శ్రీశైలం, ద్రాక్షారామం, శ్రీ కాళహస్తీ ముఖ్యమైన శైవక్షేత్రాలు. ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకొంటారు.

Back
All rights Reserved